: భాగ్యనగరిపై టీ మంత్రి ఘాటు వ్యాఖ్య... హైదరాబాదును ‘కంపు నగరం’గా పేర్కొన్న జూపల్లి
భాగ్యనగరి హైదరాబాదుకు విశ్వవ్యాప్తంగా మంచి పేరుంది. చారిత్రక నగరంగానే కాక హైటెక్ నగరంగానూ హైదరాబాదు ప్రశంసలందుకుంటోంది. సాఫ్ట్ వేర్ దిగ్గజాలు తమ కార్యక్షేత్రాలను క్రమంగా హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ కేంపస్ లను హైదరాబాదులో ఏర్పాటు చేయగా, త్వరలోనే మరిన్ని రానున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న భాగ్యనగరిని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‘కంపు నగరం’గా అభివర్ణించారు. పలువురి నిర్లక్ష్యం కారణంగా హైదరాబాదు కంపు నగరంగా మారిందని ఆయన కొద్దిసేపటి క్రితం పేర్కొన్నారు. 2019 నాటికి నగరానికి కొత్త రూపు ఇవ్వనున్నామని... ఇందులో భాగంగా పలు కీలక చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.