: మహీ కూతురు ఫస్ట్ బర్త్ డే... ట్విట్టర్ లో వెల్లువలా గ్రీటింగ్స్


టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా వయసు అప్పుడే ఏడాది దాటిపోయింది. నిన్న ఆమె ఫస్ట్ బర్త్ డేను కెప్టెన్ కూల్ చాలా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకున్నాడు. తల్లిదండ్రుల చేతుల్లో ఆ చిన్నారి బర్త్ డే బేబీగా మెరిసిపోయింది. ధోనీ ముద్దుల కూతురుగా జివాకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. నిన్న జివా బర్త్ డేను పురస్కరించుకుని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆ చిన్నారికి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. ఈ సందర్భంగా ధోనీ, అతడి భార్య సాక్షి సింగ్ లతో జివా కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన నెటిజన్లు, ఆ చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News