: లక్షా 40 వేల పాసులు జారీ...30 సినిమా హాళ్లలో ప్రదర్శన


రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఈ ఫ్లీట్ ను వీక్షించేందుకు విశాఖ ప్రజలకు మొత్తం లక్షా 40 వేల పాసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే విశాఖ నగరంలో ఉన్న 30 సినిమా ధియేటర్లలో ఈ ఫ్లీట్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దేశ విదేశీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చినందున విశాఖపట్టణం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న అనుమానంతో నగరం మొత్తాన్ని పోలీసులు జల్లెడపట్టారు. నగర శివార్ల నుంచి వివిధ ప్రాంతాలకు దారితీసే మార్గాలన్నీ పోలీసుల పహారాలోకి వెళ్లిపోయాయి. పాసులు లేకుండా ఫ్లీట్ కు రావద్దని పోలీసులు స్పష్టం చేశారు. పాసులు లేని వారిని ఎవరినీ అనుమతించేది లేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News