: గ్యాస్ బుక్ చేస్తే...కోరిక తీర్చమన్నాడు
గ్యాస్ సిలెండర్ బుక్ చేసేందుకు ఫోన్ చేస్తే, ఫోన్ లిఫ్ట్ చేసిన గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి సిలెండర్ బుక్ చేయాలంటే తన కోరిక తీర్చాలని కోరడంతో ఆ మహిళ అపరకాళిగా మారింది. పంజాబ్ లోని పటియాలాలో ఓ మహిళ, గ్యాస్ సిలెండర్ బుక్ చేసేందుకు ఏజెన్సీకి ఫోన్ చేసింది. ఏజెన్సీ ఉద్యోగి ఆవిడతో కబుర్లు కలిపి, గ్యాస్ బుక్ చేయాలంటే తన కోరిక తీర్చాలని కోరాడు. దీంతో ఆమె ఫోన్ లో జరిగిన సంభాషణ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వారి అండతో గ్యాస్ ఏజెన్సీకి చేరుకుని, ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తిని మాటను బట్టి గుర్తించింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు అతనిని చెప్పుతో కొట్టుకుంటూ తీసుకెళ్లింది. పోలీస్ స్టేషన్ లో సైతం తన ఆవేశం చల్లారేవరకు చితక్కొట్టింది. ఆ దెబ్బలకు తాళలేక సదరు వ్యక్తి ఆమె కాళ్లపైబడి క్షమాపణలు చెప్పడంతో, కేసు పెట్టకుండా వదిలేసింది. అయితే ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది.