: ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు: లక్ష్మీ మీనన్
సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో తన అధికారిక అకౌంట్ అంటూ ప్రచారం జరుగుతున్న అకౌంట్ ఫేక్ అకౌంట్ అని కోలీవుడ్ నటి లక్ష్మీ మీనన్ తెలిపింది. అది తన అకౌంట్ అనుకుని అభిమానులు, సన్నిహితులు ఫాలో అవుతున్నారని, ఈ విషయం సన్నిహితుల ద్వారా తనకు తెలిసిందని, అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నానని ఆమె వివరించింది. తనకు ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం ఉందని చెప్పిన లక్ష్మీ మీనన్, ట్విట్టర్ లో అకౌంట్ లేదని తెలిపింది. కాగా, 'కుంకీ', 'జిగర్తాండ' సినిమాల ద్వారా లక్ష్మీ మీనన్ కోలీవుడ్ లో భారీగా అభిమానులను సంపాదించుకుంది.