: రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా మంత్రులకు వర్తమానం అందింది. కాగా, ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ తదితర పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూడా చర్చిస్తారు.

  • Loading...

More Telugu News