: 'బంగారం' లాంటి మనసున్న తాతగారు!


తోటి మనుషుల కష్టాన్ని పంచుకునేందుకు గొప్పమనసుంటే చాలని గుజరాత్ కు చెందిన ఓ తాతగారు నిరూపిస్తున్నారు. అలా అని ఆయనేమీ ధనవంతుడు కూడా కాదు. ఆయన వృత్తి భిక్షాటన. ప్రతి రోజూ భిక్షాటన చేసి, వాళ్లు వీళ్ళు ఇచ్చినది దాచి, ప్రతి ఏటా తమ గ్రామంలోని పేద బాలికలకు పుస్తకాలు, స్కూలు యూనిఫాంలు కొనిచ్చి బాగా చదువుకొమ్మని ప్రోత్సహిస్తాడు. మొహసానా గ్రామానికి చెందిన ఖింజీభాయ్ ప్రజాపతి అనే ఈ పెద్దాయన గత పదేళ్లుగా ఆ గ్రామంలో పేదపిల్లల విద్యకోసం పాటుపడుతున్నారు. ఈ ఏడాది కూడా ఆయన పుస్తకాలు, యూనిఫాం తీసుకువస్తారని పిల్లలంతా ఆశించారు. అయితే ఆయన ఎప్పట్లా పుస్తకాలు, యూనిఫాంలు కాకుండా బంగారు చెవి పోగులు తీసుకుని వచ్చి పేదపిల్లల ముఖాల్లో కాంతులు నింపారు. ఒక్కో చెవిపోగుకు ఆయన 1300 రూపాయలు ఖర్చు చేశారు. తాతగారి ఆలోచన తెలిసిన నగల దుకాణం యజమాని మూడువేల రూపాయల డిస్కౌంట్ ఇచ్చాడు. గత పదేళ్లలో ఆయన భిక్షాటన ద్వారా సంపాదించిన 80 వేల రూపాయలను ఖర్చుచేసి, బాలికలకు బహుమతులు అందజేస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నారు. తన చరమాంకం వరకు ఇలా బాలికలను విద్యనిమిత్తం ప్రోత్సహిస్తానని, అందుకోసం అదనపు సమయం కూడా భిక్షాటన చేస్తానని ఆయన చెప్పారు. ఆయన చెవిపోగులు ఇచ్చిన అనంతరం ఓ మహిళ మాట్లాడుతూ, తమ పిల్లల చెవుల్లో బంగారం చూస్తామని భావించలేదని, తాతగారి గొప్పమనసు వల్ల బంగారం చూస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News