: ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఏపీ ఆదేశాలివ్వడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కృష్ణానదీ బోర్డు, అత్యున్నత జల మండలి అనుమతుల్లేకుండా ఆదేశాలివ్వడంపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న కాల్వ పనులను నిరోధించాలని లేఖలో కేంద్రానికి సూచించింది. అలాగే కర్ణాటకపై కూడా ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. రాయచూర్ జిల్లా గిరిజాపూర్ వద్ద కృష్ణా నదిపై అక్రమంగా బ్యారేజీ నిర్మాణం చేపట్టిందని, ఆ పనులను వెంటనే ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

  • Loading...

More Telugu News