: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమంగళం వద్ద తమిళనాడు ఆర్టీసీకి చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలవ్వగా, 20 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందర్నీ స్థానికులు స్పందించి హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితులకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.