: మీరు దీక్ష చేయడం సరికాదు: ముద్రగడకు మంత్రి నారాయణ సూచన
కాపులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీక్ష చేయడం సరికాదని ముద్రగడ పద్మనాభంకు మంత్రి నారాయణ సూచించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నన్నినాళ్లు మౌనంగా ఉండి, అధికారం పోగానే కాపుల ప్రయోజనాలు గుర్తుకు రావడం వెనుక నైతికత ఎంతో ఆలోచించాలని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు న్యాయం చేయండి అంటూ నిరాహార దీక్షకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ముద్రగడ సానుకూలంగా ఆలోచించి దీక్షను విరమించాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని, సమస్యలను జటిలం చేయవద్దని ఆయన కోరారు.