: కానిస్టేబుల్ తుపాకీతో పోలీస్ అధికారి పరారీ


జమ్మూకాశ్మీర్ లో పోలీసులే తుపాకులు ఎత్తుకెళ్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండడం ఆందోళన రేపుతోంది. జనవరి 16న ఓ పోలీసు అధికారి ఇంటి నుంచి నాలుగు రైఫిళ్లను ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే ఓ పోలీసు అధికారి తన దగ్గర పని చేసే కానిస్టేబుల్ తుపాకీని ఎత్తుకెళ్లిన మరో ఘటన చోటుచేసుకుంది. రైనావరీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న షౌకత్ అహ్మద్ అనే కానిస్టేబుల్ కు చెందిన ఏకే 47 తుపాకీని రియాజ్ అహ్మద్ అనే ప్రత్యేక పోలీసు అధికారి ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు రియాజ్ ఉగ్రవాదుల్లో చేరేందుకే ఈ పని చేసి ఉంటాడని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మధ్య కాలంలో ఐఎస్ఐఎస్ కు చెందిన జెండాలు కాశ్మీర్ లో ఎగురుతున్న నేపథ్యంలో, ఇలాంటి వారి చర్యలు ఐఎస్ఐఎస్ బలోపేతానికి సంకేతాలా? అనే దిశగా పోలీసు వర్గాలలో ఆందోళన కలుగుతోంది.

  • Loading...

More Telugu News