: అజంఖాన్ సంచలన ఆరోపణ... దావూద్ ను మోదీ కలిశారంటున్న ఎస్పీ నేత
సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కొత్త ఆరోపణ చేశారు. గతేడాది డిసెంబర్ లో లాహోర్ లో పర్యటించిన సమయంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆయన కలుసుకున్నారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని ప్రకటించారు. దాంతో కలకలం రేగుతోంది. సంచలన ఆరోపణలకు పెట్టింది పేరయిన అజంఖాన్ చేసిన తాజా ఆరోపణ ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.