: అక్షయ్ కుమారుడి చెవి పట్టుకొని 'మంచి బాలుడు' అంటూ మెచ్చుకున్న మోదీ!


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓ తండ్రిగా పొంగిపోతున్నాడు. పుత్రోత్సాహంతో మురిసిపోతున్నాడు. అందుకు కారణం, తన కుమారుడు అర్నవ్ ను ప్రధాని మోదీ మెచ్చుకోవడమే. విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు అక్షయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ వచ్చిన అక్షయ్ తన వెంట కొడుకుని కూడా తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా అర్నవ్ చెవి పట్టుకొని 'మంచి బాలుడు' అంటూ మోదీ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను అక్కీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది తన జీవితంలో మరచిపోలేని సంఘటన అని తెలిపాడు. అటు అర్నవ్ తల్లి ట్వింకిల్ ఖాన్నా కూడా ఉప్పొంగిపోయింది. వేల పదాలకుండే విలువ నిజంగా ఈ దృశ్యానికుందంటూ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News