: తైవాన్ భూకంపంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య... వందలాది ఇళ్లు ధ్వంసం
తైవాన్ లో సంభవించిన భూకంపం ధాటికి చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మృతులలో 10 రోజుల వయసుగల చిన్నారి కూడా ఉంది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు. దాదాపు 400 మంది భద్రతా సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. ఇంతవరకు శిథిలాల్లో చిక్కుకున్న దాదాపు వందమందిని సురక్షితంగా బయటకు తీశారు. మరో 30 మంది శిథిలాల్లో చిక్కుకున్నారని అధికారులు భావిస్తున్నారు. లూనార్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అందరూ ఒకచోట చేరి వేడుకలు జరుపుకుంటున్న సంతోషకర సందర్భంలో హఠాత్తుగా భూకంపం రావడంతో అంతా ప్రాణభయంతో వణికిపోయారు.