: ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చాక సనత్ నగర్ కు మళ్లీ ఎన్నికలు అవసరమా?: కేటీఆర్


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ శాసన సభకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, సనత్ నగర నియోజకవర్గ పరిధిలోని ఆరు కార్పొరేషన్ స్థానాల్లోను టీఆర్ఎస్ విజయం సాధించిందంటే తలసానిపై ప్రజలు విశ్వాసం ఉంచినట్టే కదా? అని అన్నారు. అలాంటి తరుణంలో అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ఆయన అడిగారు. అయితే అది స్పీకర్ పరిధిలోని అంశమని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News