: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర షేన్ వాట్సన్...అత్యల్పం సచిన్ బేబీ!


ఐపీఎల్ లో ఆటగాళ్ల వేలం జోరుగా సాగుతోంది. చెన్నై, రాజస్థాన్ జట్ల స్థానంలో రాజ్ కోట్, గుజరాత్ జట్లు రంగప్రవేశం చేయడంతో జట్ల కూర్పు రసవత్తరంగా సాగుతోంది. వేలం సందర్భంగా కొన్ని జట్లు ఖరీదైన ఆటగాళ్లను వదులుకోగా, ఆ డబ్బుతో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపాయి. ఈ క్రమంలో జట్లలో పలు మార్పులు చోటుచేసుకోగా, రాజస్థాన్ తరపున ఆడిన షేన్ వాట్సన్ ను 9.5 కోట్ల రూపాయలు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. బెంగళూరు మాజీ ఆటగాడు కరణ్ నాయర్ ఈ సారి వేలంలో ఊహించని ధరను సొంతం చేసుకున్నాడు. గత సీజన్లో పది లక్షల రూపాయలకు ఇతనిని కొనుగోలు చేయగా, ఈ సారి నాలుగు కోట్ల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొనుగోలు చేసింది. గత సీజన్ లో 30 లక్షల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన పవన్ నేగీని 8.5 కోట్ల రూపాయలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక పారితోషికానికి అమ్ముడు పోయిన ఆటగాళ్ల జాబితాలో నేగీ చోటు సంపాదించుకున్నాడు. కేవలం 10 లక్షల రూపాయల ధరకు కేరళకు చెందిన సచిన్ బేబీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ సారి వేలంలో ఇదే అత్యల్ప ధర!

  • Loading...

More Telugu News