: మా సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లలేదు...దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి


తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అదృశ్యమయ్యారని, కనిపించడం లేదని మీడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లలేదని, ఆ వార్తలన్నీ మీడియా సృష్టేనని చెప్పారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారని, ఈ పర్యటన చాలాకాలం కిందటే ఫిక్స్ చేసుకున్నదని తెలిపారు. తుని ఘటన నేపథ్యంలో సీఎం, హోంమంత్రి బిజీగా ఉన్నారని... ఈ సమయంలో గన్ మెన్ల వ్యవహారం వారితో మాట్లాడటం మంచిది కాదని జేసీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News