: టీఆర్ఎస్ ఎంపీ ఇంటిపై కోడి గుడ్లు... గిరిజన వర్సిటీ కోసం విద్యార్థుల ఆందోళన
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాదు జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులు టీఆర్ఎస్ నేత, ఆదిలాబాదు ఎంపీ నగేశ్ ఇంటిపై దాడికి దిగారు. కొద్దిసేపటి క్రితం ఆదిలాబాదులో ఆందోళనకు దిగిన పలు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు నేరుగా ఎంపీ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. ఎంపీ ఇంటికి చేేరుకున్న వెంటనే కొంతమంది విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగని విద్యార్థులు ఎంపీ ఇంటిపై కోడిగుడ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను నిలువరించే యత్నం చేస్తున్నారు.