: దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల బోణి... మహిళల సైక్లింగ్ లో స్వర్ణం
అసోం లోని గౌహతిలో జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకం సాధించింది. ఇవాళ ప్రారంభమైన మహిళల 30 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో మణిపూర్ కు చెందిన సైక్లిస్ట్ విజయలక్ష్మి సత్తా చాటింది. 49 నిమిషాల 24 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దాంతో 12వ దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన మొదటి క్రీడాకారిణిగా పేరు నమోదు చేసుకుంది. అలాగే మణిపూర్ కు చెందిన మరో సైక్లిస్ట్ ఛోబా దేవి 49 నిమిషాల 31 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది.