: గెలిచిన రెండో రోజే నగరంలో కేటీఆర్, తలసాని పర్యటన
గ్రేటర్ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న రెండో రోజే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. పద్మారావునగర్ హమాలీబస్తీలో కేటీఆర్ తో కలసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటిస్తున్నారు. బస్తీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరారు. విజయగర్వంతో పొంగిపోవద్దని తమ నేత (కేసీఆర్) తమకు చెప్పినట్టు తెలిపారు. గెలిచిన మరుసటి రోజే బస్తీల్లో పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పారు. ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేస్తామని మంత్రులు తెలిపారు.