: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ లో సెమీఫైనల్ కు భారత్


ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరింది. ఇవాళ క్వార్టర్ ఫైనల్లో నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 197 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 349 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన నమీబియా 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ప్రధానంగా భారత ఓపెనర్ ఆర్ ఆర్ పంత్(111), సర్ఫరాజ్ ఖాన్ (76), అర్మాన్ జాఫర్ (64) పరుగులతో రాణించారు. అన్మోల్ ప్రీత్ సింగ్ 41, లోమ్రోర్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అటు నమీబియా బౌలర్ కోయెట్టీ మూడు వికెట్లు సాధించాడు.

  • Loading...

More Telugu News