: పాఠశాలలో కొండచిలువ... భయంతో పరుగులు పెట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లోని ఓ సర్కారీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు నేటి ఉదయం ఉరుకులు పరుగులు పెట్టారు. ఎన్నికల ప్రచారానికి భయపడి వారు పరుగు లంకించుకున్నారనుకుంటే, పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, వారు పరుగు లంకించుకుంది ఓ భారీ కొండచిలువను చూసి! నారాయణ్ ఖేడ్ పరిధిలోని గాంధీ నగర్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలోకి నేటి ఉదయం ఓ కొండచిలువ ప్రవేశించింది. అప్పటికే పాఠశాలలోకి చేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కొండచిలువను చూసి బయటకు పరుగులు తీశారు.