: ప్రభుత్వ ప్రతిపాదనలకు కొన్ని సవరణలు సూచించా: ముద్రగడ
ప్రభుత్వం తరపున గత రాత్రి తనతో చర్చలు జరిపేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కొన్ని ప్రతిపాదనలు చేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆ ప్రతిపాదనలకు తాను కొన్ని సవరణలు సూచించానని తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మరోసారి వస్తానని భాస్కరరామారావు చెప్పారని వివరించారు. ఒకవేళ సీఎం నుంచి సానుకూల స్పందన రాకుంటే దీక్ష కొసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తమ జాతికి న్యాయం జరుగుతుందంటే ఒక మెట్టు దిగడానికి సిద్ధమేనని ఉద్ఘాటించారు. భార్యతో కలసి ముద్రగడ చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.