: యువీకి ఆశించిన ధర లభించలేదు... రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్
టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఐపీఎల్-9లో ఆశించిన ధర లభించలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాదు జట్లు యువీ కోసం హోరాహోరీగా పోరాడినా, అతడికి గత సీజన్ లో లభించిన ధరలో సగం కూడా దక్కకపోవడం గమనార్హం. నేటి ఉదయం బెంగళూరులో ప్రారంభమైన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు యువీని కేవలం రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ లో యువీకి ఏకంగా రూ.16 కోట్ల ధర లభించింది. అంతకుముందు వేలంలో అతడికి రూ.12 కోట్లు లభించాయి. తాజా వేలంలోనూ యువీకి భారీ ధర పలుకుతుందని భావించినా, కేవలం రూ.7 కోట్లకే అతడిని సన్ రైజర్స్ యాజమాన్యం దక్కించుకుంది.