: ఐపీఎల్ వేలం షురూ... వాట్సన్ ను రూ.9.5 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు


విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ కు సంబంధించిన ఆటగాళ్ల వేలం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైన ఈ వేలంలో అందరూ ఊహించినట్లుగానే ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు మంచి ధర లభించింది. రూ.9.5 కోట్లు వెచ్చించి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అతడిని కొనేసింది. ఇక ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ను పూణే జట్టు రూ.3.5 కోట్లకు దక్కించుకుంది. ఇషాంత్ శర్మను రూ.3.8 కోట్లకు పూణే జట్టు కొనుగోలు చేసింది. వెస్టిండిస్ కీలక ఆటగాడు డ్వేనీ స్మిత్ ను రాజ్ కోట్ జట్టు రూ.2.3 కోట్లకు చేజిక్కించుకుంది.

  • Loading...

More Telugu News