: తైవాన్ లో పెను భూకంపం.. కుప్పకూలిన 17 అంతస్తుల భవంతి, ముగ్గురి మృతి


చైనా సరిహద్దు దేశం తైవాన్ లో నేటి ఉదయం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో కూడిన ఈ భూకంపం ఆ దేశంలో పెను విధ్వంసాన్నే సృష్టించింది. భూకంపం ధాటికి తైవాన్ లోని ఓ 17 అంతస్తుల భారీ భవంతి పేకమేడలా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందికి పైగా ప్రజలను కాపాడారు. భవనం శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారని సమాచారం. ఈ భూకంపానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News