: కాపు ప్రజాప్రతినిధులూ! రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టండి: హర్షకుమార్ పిలుపు
కాపు ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాంగ్రెస్ నేత హర్షకుమార్ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, కాపు నేతలంతా ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా రాజీనామాలు చేయాలని అన్నారు. చంద్రబాబునాయుడు ఓపక్క కాపులకు రిజర్వేషన్లు అంటూ మరోపక్క బీసీలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నానని చెప్పిన హర్షకుమార్, అవసరమైతే కాపుల తరపున ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటానని అన్నారు.