: గ్రేటర్ పై 'గులాబి' జెండా పాతిన టీఆర్ఎస్!
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఇప్పటి వరకు 150 స్థానాల ఫలితాలు వెలువడగా, టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. 44 స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. బీజేపీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు విజయం సాధించారు. ఇక, టీడీపీ నుంచి కేవలం ఒక్కరు మాత్రమే విజయం సాధించడం విశేషం. 11న మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అప్పటి రిటర్నింగ్ అఫీసర్ గా హైదరాబాదు కలెక్టర్ వ్యవహరించనున్నారు. జాంబాగ్ లో రీ కౌంటింగ్ వినతి రాగా, దానిని పూర్తి చేసిన అధికారులు అక్కడి ఫలితం వెల్లడించారు. వివాదం రేపిన పురానాపూల్ లో ఎంఐఎం విజయం సాధించడం విశేషం.