: ఇప్పటివరకు 96 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది: ఎన్నికల కమిషన్


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధికంగా 96 స్థానాల్లో విజయం సాధించిందని గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ఫలితాలను రెండోసారి విడుదల చేసిన సందర్భంగా మొత్తం 128 స్థానాల ఫలితాలు వెల్లడైనట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా 96 కార్పొరేషన్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని ఆయన చెప్పారు. 28 స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం పార్టీ ద్వితీయ స్ధానంలో నిలిచిందని చెప్పారు. బీజేపీ నాలుగు స్థానాలలో విజయం సాధించగా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చెరొక స్థానంలో విజయం సాధించాయని ఎన్నికల సంఘం తెలిపింది.

  • Loading...

More Telugu News