: ప్రజాతీర్పును శిరాసావహిస్తున్నాం...ప్రజల తరపున పోరాడుతాం: లోకేశ్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ సిద్ధాంతం అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. ఎప్పట్లాగే ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు.