: 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక...పార్టీ నిర్ణయమే ఫైనల్: కేసీఆర్


ఈ నెల 11న గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎంపిక చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ విజయం ఖరారైన అనంతరం టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికలో పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ అవసరం ప్రస్తుతానికి లేదని చెప్పిన ఆయన, భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఆలోచనలను అమలు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News