: ఆ ఒక్క హామీ మినహా అన్నీ నెరవేర్చాం: కేసీఆర్
శాసనసభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ మినహా ప్రతి హామీని నెరవేర్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా హైదరాబాదు, టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, కేజీ టూ పీజీ ఉచిత విద్యను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని చూస్తున్నామని అన్నారు. సమగ్ర ప్రణాళికలు రచించేందుకు కొంత సమయం కావాలని చెప్పిన ఆయన, త్వరలోనే దానిని అమలు చేస్తామని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే తమ పార్టీ ధ్యేయమని ఆయన చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఆయన చెప్పారు.