: నారాయణ నాకు మిత్రుడు...అతని చెవి జోలికి ఎవరూ వెళ్లవద్దు: కేసీఆర్
సీపీఐ నారాయణ తనకు మంచి మిత్రుడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీపీఐ నారాయణ జోలికి ఎవరూ వెళ్లవద్దని అన్నారు. తన మిత్రుడ్ని ఒక్క చెవితో చూడడం తనకు ఇష్టం లేదని ఆయన చమత్కరించారు. దీంతో పాత్రికేయులు కూడా నవ్వేశారు. అనంతరం ఆయన కొనసాగిస్తూ, తనకంటే సీనియర్ అయిన కేకేకు నారాయణ మరింత మంచి స్నేహితుడని అన్నారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా ఉండడం మేలని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంలో చాలా విమర్శలు చేసుకుంటామని, వాటిని స్పోర్టివ్ గా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.