: ఇప్పటివరకు టీఆర్ఎస్ 80, ఎంఐఎం 28, టీడీపీ 1, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి: ఎన్నికల సంఘం
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం తొలిసారి అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 80 స్థానాల్లో విజయం సాధించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎంఐఎం పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ కేవలం ఒక్క స్థానంలోను, బీజేపీ 3 స్థానాల్లోను విజయం సాధించాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మరిన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, నాలుగు డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.