: మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓటమి!
గ్రేటర్ ఎన్నికల్లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తార్నాక డివిజన్ నుంచి పోటీ చేసిన కార్తీక రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సరస్వతి చేతిలో ఓడిపోయారు. కాగా, గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. అంచనాలకు మించి కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 45 డివిజన్లలో విజయం సాధించగా, అత్యధిక డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం 19 డివిజన్లలో విజయం సాధించింది. మూడు డివిజన్లలో అధిక్యత కొనసాగుతోంది. మిగిలిన పార్టీల విషయానికి వస్తే టీడీపీ 1, కాంగ్రెస్ 1 డివిజన్ లో విజయం సాధించాయి.