: 13 డివిజన్లను కైవసం చేసుకున్న ఎంఐఎం
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 13 డివిజన్లలో ఇప్పటివరకు విజయం సాధించింది. లిలిత్ బాగ్, రియాసత్ నగర్, డబీర్ పురా, అక్బర్ బాగ్, ఫలక్ నుమా, నవాబ్ సాహెబ్ కుంట, శాలిబండ, అహ్మద్ నగర్, విజయ్ నగర్ కాలనీతో పాటు మరో నాలుగు డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలోని మజ్లిస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరో 8 డివిజన్లలో ఎంఐఎం అధిక్యత కొనసాగుతోంది.