: టీఆర్ఎస్ భవన్ దగ్గర మొదలైన సంబరాలు


హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భవన్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారన్న వార్తలు వెలువడడంతో టీఆర్ఎస్ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు గానాభజానాతో సందడి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచారకర్త మంత్రి కేటీఆర్, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని పలువురు కార్యకర్తలు పేర్కొంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లానే గ్రేటర్ హైదరాబాదు వాసులు కూడా స్పందించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంభ్రమాశ్చర్యానందాల్లో మునిగిపోయారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో కార్యకర్తలు డాన్సులు వేస్తూ, టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News