: లోధా కమిటీ ప్రతిపాదనల అమలుకు బీసీసీఐ సుముఖంగానే ఉంది: అనురాగ్ ఠాకూర్


ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ స్కాం నేపథ్యంలో దేశీయ క్రికెట్ లో తేవాల్సిన మార్పులపై జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనలు అమలు చేసేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గత 9 నెలల నుంచి బోర్డులోని పారదర్శకతను అందరూ హర్షిస్తున్నారని ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలు మరోసారి తమ ప్రతిపాదనలను పరిశీలించుకోవాలని సూచించారు. దీనిపై ఈ నెల 7న సమావేశమై నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News