: టీఆర్ఎస్ దే గ్రేటర్...102 స్థానాల్లో ఆధిక్యం


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. 102 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఎన్నికలకు ముందు వంద స్థానాలను గెలిచి చూపిస్తామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యను నిజం చేసే దిశగా టీఆర్ఎస్ సాగుతోంది. పాతబస్తీ మినహా మిగిలిన మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్లీ విజయం దిశగా వెళ్తోంది. చాలా చోట్ల వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ గద్దెపై టీఆర్ఎస్ పార్టీ సొంతంగా అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. ఈ వివరాలు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు ఇబ్బందికరంగా పరిణమించాయి. ఎంఐఎం 30 స్థానాల్లో ముందుంది. పాతబస్తీలో నాలుగైదు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం వైపు దూసుకుపోవడం ఆసక్తి రేపుతోంది.

  • Loading...

More Telugu News