: ఒలింపిక్స్ పై పుకార్లు...రద్దు చేసే ఆలోచన లేదు: బ్రెజిల్


బ్రెజిల్ లో జికా వైరస్ విజృంభిస్తున్న వేళ రియో ఒలింపిక్స్ ను రద్దు చేయనున్నారని, ఒలింపిక్స్ నిర్వహణ సజావుగా సాగేందుకు తక్కువ వ్యవధిలో నిర్వహించగలిగే దేశంవైపు ఒలింపిక్స్ నిర్వహణా కమిటీ ఎదురు చూస్తోందని స్పోర్ట్స్ సర్కిల్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోజురోజూ పుకార్లు పెరిగిపోతుండడంతో బ్రెజిల్ దీనిపై నోరు విప్పింది. జికా వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రెజిల్ తెలిపింది. రియో ఒలింపిక్స్ నిర్వహణను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నామని తెలిపింది. ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వివరించారు. డబ్ల్యూహెచ్ వో బ్రెజిల్ కు ప్రయాణాలపై నిషేధం విధించలేదన్న విషయం గుర్తించాలని వారు తెలిపారు. గర్భిణులను మాత్రం తమ దేశానికి వెళ్లవద్దని సూచించిందని బ్రెజిల్ స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ సమర్ధవంతంగా నిర్వహిస్తామని బ్రెజిల్ తెలిపింది.

  • Loading...

More Telugu News