: ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపిన సినీ దర్శకుడు దాసరి


కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సంఘీబావం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముద్రగడ నివాసానికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఈ చర్య ముమ్మాటికీ పౌర హక్కుల ఉల్లంఘనే అని దాసరి వ్యాఖ్యానించారు. కిర్లంపూడికి కాపులు రావద్దన్న నిబంధన సభ్య సమాజం తల దించుకునేలా ఉందని దాసరి అన్నారు.

  • Loading...

More Telugu News