: సొంత రెస్టారెంట్లో ఘనంగా జరిగిన 'సర్' నిశ్చితార్థం
టీమిండియా మొత్తం ముద్దుగా 'సర్' అని పిలుచుకునే రవీంద్ర జడేజా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రాజ్ కోట్ కి చెందిన మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకీతో రవీంద్ర జడేజాకు వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. దీంతో నేడు రవీంద్ర జడేజాకు చెందిన రెస్టారెంట్లో సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫోటోను రవీంద్ర జడేజా ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశాడు. దీనికి అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. కాగా, ఈ ఏడాది పలువురు క్రికెటర్లు ఒకింటివారు కానున్న సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కు ఇప్పటికే నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే.