: ప్రారంభమైన గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు


జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 24 చోట్ల 150 డివిజన్ల ఓట్లు లెక్కిస్తున్నారు. మొదట అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఎన్నికల విధుల్లో 5,626 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత చేపట్టారు. అన్నిచోట్ల 144 సెక్షన్ విధించారు. పురానాపూల్ లో రీపోలింగ్ నేపథ్యంలో ఐదు గంటల తరువాతే గ్రేటర్ ఫలితాలను వెల్లడించనున్నారు. రాత్రి 8 గంటలకు గ్రేటర్ ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగియనుంది.

  • Loading...

More Telugu News