: జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది తొలగింపుపై గాయకుడు సోనూ నిగమ్ స్పందన
విమానంలో తను పాటలు పాడినందుకు ఐదుగురు జెట్ ఎయిర్ వేస్ సిబ్బందిని సస్పెండ్ చేయడంపై బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ స్పందించాడు. 'భారత్ లో అసలైన అసహనం అంటే ఇదే' అని అన్నాడు. విమానాల్లో చిన్న చిన్న సరదాలు జరుగుతూ ఉంటాయన్నాడు. పైలట్లు, సిబ్బంది ప్రయాణికులను ఉత్సాహపరిచేందుకు సరదాగా జోక్స్ వేసుకోవడం కూడా తాను చూశానని చెప్పాడు. అంతేగాక ఓసారి విమానంలోనే పెద్ద ఎత్తున ఫ్యాషన్ షో నిర్వహించడం కూడా చూశానని తెలిపాడు. అటువంటిది ప్రయాణికులు అభిమానంతో అడిగినందుకు తాను పాట పాడితే సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమంటూ దానిని ఖండించాడు. ప్రయాణం హ్యాపీగా సాగుతుండగా, విమాన సిబ్బంది ఎలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరంలేని సమయంలోనే తాను విమానంలోని అడ్రెసింగ్ సిస్టమ్ ని ఉపయోగించానని వివరించాడు. ఇలా చేయడం శిక్షించడమేనని సోనూ పేర్కొన్నాడు.