: కేంద్రం మద్దతు లేకుండా రిజర్వేషన్లు అమలు చేసే ధైర్యం రాష్ట్రానికి ఉందా?: మంద కృష్ణ
ఏపీ ప్రభుత్వం ఇస్తామంటున్న కాపు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని నిలదీశారు. 9 నెలల్లో జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదిక ఇస్తుందని, తరువాత రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం అంటోందని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు చేసే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని మంద కృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్లే ఆందోళనలు, నిరసనలు వచ్చాయన్నారు. ఇక తుని ఘటనలో జగన్ పాత్ర ఉందంటోన్న ప్రభుత్వం ఆయనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని అడిగారు.