: రియాలిటీ షోలో పాల్గొనాలన్న మక్కువతో... హంతకుడైన ఓ యువకుడు


రియాలిటీ షోలో పాల్గొనాలన్న కోరిక ఓ యువకుడిని రెండు హత్యలు చేసేందుకు పురికొల్పింది. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన 17 సంవత్సరాల యువకుడికి రియాలిటీ షోలో పాల్గొనాలన్నది చిరకాల కోరిక. ఈ క్రమంలో డబ్బులు అవసరమై ఏకంగా కిడ్నాప్ లు, హత్యలు చేశాడు. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. గత సెప్టెంబర్ లో స్నేహితురాలితో కలిసి స్వప్నేశ్ గుప్త(13) అనే బాలుడిని కిడ్నాప్ చేశాడు. రూ.60వేలు ఇస్తేనే వదిలేస్తానని బాలుడి తండ్రిని బెదిరించాడు. వాళ్లు డబ్బివ్వకపోవడంతో బాలుడిని బెల్టుతో గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసులో కొన్నాళ్లు ఆ యువకుడు, అతని స్నేహితురాలు జువైనల్ హోమ్ లో ఉన్నారు. అక్కడ మంచి ప్రవర్తనతో ఉండడంతో అధికారులు వదిలిపెట్టారు. అయితే, జైలు నుంచి వచ్చాక కూడా ఆ యువకుడికి రియాలిటి షోలో పాల్గొనాలన్న కోరిక అలాగే ఉండడంతో ఈసారి ఓ వృద్ధురాలి ప్రాణం తీశాడు. దక్షిణ ఢిల్లీలోని బీకేదత్ కాలనీలోని మితిలేశ్ జైన్(65) అనే వృద్ధురాలిని హత్య చేశాడు. నాలుగు రోజుల కిందట ఆమె ఇంట్లోకి వెళ్లి నగదు, బంగారం, రెండు సెల్ ఫోన్లు ఎత్తుకుని వెళ్లిపోయాడు. వృద్ధురాలి మృతి విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముందు వృద్ధురాలిది సహజమరణం అనుకున్నారు. తర్వాతా దొంగతనం విషయం కూడా తెలియడంతో దొంగిలించిన సెల్ ఫోన్ ద్వారా పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. రియాలిటీ డ్యాన్స్ షోలో పాల్గొనడానికే రెండు హత్యలు చేశానని అంగీకరించాడు.

  • Loading...

More Telugu News