: ముద్రగడ దీక్షకు మద్దతు వెల్లువ... ప్లేట్లు, గరిటెలతో హోరెత్తిస్తున్న కాపులు


కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. తన దీక్షకు సంఘీభావంగా మధ్యాహ్నం భోజనం మానేసి ప్లేట్లపై గరిటెలతో శబ్దం చేయాలన్న ముద్రగడ పిలుపునకు కాపులు పెద్ద ఎత్తున స్పందించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రస్తుతం ప్లేట్లు, గరిటెల శబ్దం హోరెత్తుతోంది. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం మానేసిన కాపులు ప్లేట్లు, గరిటెలను పట్టుకుని తమ ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చేశారు. నడి వీధుల్లో నిలబడి ప్లేట్లపై గరిటెలతో శబ్దం చేస్తూ కాపులు ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు ప్లేట్లు, గరిటెల శబ్దాలతో హోరెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News