: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బచ్చన్ కుటుంబం!
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబం ఈరోజు మాల్లీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. తమ కుటుంబం మాల్దీవుల్లో ఎందుకు గడపాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయన తెలిపారు. ఈరోజు అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు అని.. 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడని అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఒక షిప్ లో వారు ప్రయాణిస్తున్న ఫొటోతో పాటు ‘హ్యాపిీ బర్త్ డే’ అంటూ రాసి ఉన్న మరో ఫొటోను కూడా అమితాబ్ పోస్ట్ చేశారు.