: కొత్తగా కనిపించనున్న 2,400 ఫ్రెంచ్ పదాలు !
భాషా పరమైన మార్పులు కోరుతూ ఫ్రాన్స్ భాషా మండలి నిర్ణయం తీసుకుంది. పాతకాలం నాటి పదాలను సరళీకృతం చేయాలన్న ఉద్దేశంతో దశలవారీగా కొత్త అక్షరమాలను అమలు చేసేందుకు ఫ్రాన్స్ దేశ విద్యా విభాగం సంస్కరిస్తోంది. కొత్త విధానం ప్రకారం ఆంగ్ల అచ్చులు I మరియు U స్థానంలో ఉండే స్వర ఆధారిత సిర్కామ్ ఫ్లెక్స్‌ను భాషాధికారులు తొలిగిస్తున్నారు. ఇకపై ఆ రెండు అక్షరాలు ఉన్న పదాలను పలికే తీరులో మార్పు వస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే విద్యా వార్షిక సంవత్సరం నుంచి ఈ నూతన పదాల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ పదాల్లో మార్పుల వల్ల పాఠశాల విద్యార్థులు, టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.