: కాల్ మనీ కేటుగాడిపై రౌడీషీటు!


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడ సహా ఏపీ వ్యాప్తంగా వెలుగుచూసిన కాల్ మనీ భాగోతంలో కీలక నిందితుడిగా ఉన్న యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాముపై రౌడీషీట్ ఓపెన్ అయిపోయింది. గతేడాది డిసెంబర్ లో విజయవాడలోని పటమట పంటకాల్వ రోడ్డులో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించిన రాము ఓ మహిళను బెదిరించి లొంగదీసుకున్నాడు. తనను బలవంతంగా లొంగదీసుకోవడమే కాక పలు రకాల వేధింపులకు గురి చేసిన రాముపై బాధిత మహిళ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో రాము సహా ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో రాముపై రౌడీషీట్ తెరిచారు.

  • Loading...

More Telugu News